తియ్యటి తేనె.. రుచీ, బలం!

పరగడుపున గ్లాసు నీళ్లలో చెంచా తేనె వేసుకుని తాగితే చాలా మంచిదంటారు. ఇంతకూ తేనెలో ఉన్న సుగుణాలేంటో చూద్దాం. క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్‌, భాస్వరం, పొటాషియం, సోడియం, రిబోఫ్లేవిన్‌, కాపర్‌, జింగ్‌, పీచు, ఫ్రుక్టోజ్‌, గ్లూకోజ్‌, ప్రొటీన్లతో ఇది మంచి పోషకాహారం.

Published : 18 Feb 2024 00:04 IST

రగడుపున గ్లాసు నీళ్లలో చెంచా తేనె వేసుకుని తాగితే చాలా మంచిదంటారు. ఇంతకూ తేనెలో ఉన్న సుగుణాలేంటో చూద్దాం. క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్‌, భాస్వరం, పొటాషియం, సోడియం, రిబోఫ్లేవిన్‌, కాపర్‌, జింగ్‌, పీచు, ఫ్రుక్టోజ్‌, గ్లూకోజ్‌, ప్రొటీన్లతో ఇది మంచి పోషకాహారం. తేనె చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. డయేరియా, అల్సర్లు, శ్వాస ఇబ్బందులను తగ్గిస్తుంది. రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్లను నిరోధిస్తుంది. కంటిచూపును, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలోనూ తోడ్పడుతుంది. వెంటనే శక్తి చేకూరేలా చేస్తుంది.

తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు సూక్ష్మక్రిములను నశింపచేస్తాయి. మంట, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. గాయాలు త్వరగా మానతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. కనుక షుగర్‌ పేషెంట్లు కూడా తేనె తీసుకోవచ్చు. ఆయుర్వేద వైద్యంలో బాలాన్నిచ్చే టానిక్‌ల నుంచి పక్క తడపటం, చర్మవ్యాధులు, గాయాలు, ఉబ్బసం, ఊబకాయం, నిద్రలేమి, చూపు సమస్యలు, కడుపులో అల్సర్లు, వాంతులు, వికారం, పచ్చకామెర్లు, కీళ్లనొప్పుల వరకూ అనేక ఔషధాల్లో తేనె ఉపయోగిస్తారు. పసిపిల్లలకు కాస్త మోతాదులో తేనె ఇవ్వడం మంచిది. తేనె వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిశాక నిర్లక్ష్యం చేయగలమా! కానీ ఎక్కువ శాతం పంచదార లేదా బెల్లం పాకాన్ని తేనెగా అమ్ముతుంటారు. కనుక స్వచ్ఛమైన తేనె అవునో కాదో గమనించుకోవడం చాలా ముఖ్యం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని