సూపర్‌.. సెనగలు

శ్రావణమాసం అంటే నానబెట్టిన సెనగలే గుర్తుకొస్తాయి ఎవరికైనా? సెనగలే కదా అని వాటిని తేలిగ్గా తీసుకోవద్దు.. ఎందుకంటే పోషకాహార నిపుణులు వీటిని సూపర్‌ఫుడ్‌గా అభివర్ణిస్తారు మరి..

Published : 24 Jul 2022 01:25 IST

శ్రావణమాసం అంటే నానబెట్టిన సెనగలే గుర్తుకొస్తాయి ఎవరికైనా? సెనగలే కదా అని వాటిని తేలిగ్గా తీసుకోవద్దు.. ఎందుకంటే పోషకాహార నిపుణులు వీటిని సూపర్‌ఫుడ్‌గా అభివర్ణిస్తారు మరి..

* జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి మంచి ఆహారం సెనగలు. వయసుతో పాటు వచ్చే డిమెన్షియా, ఆల్జీమర్స్‌ని కూడా ఈ సెనగలు నియంత్రిస్తాయి. కారణం.. శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ని అదుపుచేసే శక్తి వీటికి ఉంది.

* కొందరికి ముఖంపై తెల్లని మచ్చలు వస్తుంటాయి. నానబెట్టిన సెనగలని త్రిఫల చూర్ణంతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంటుంది.

* సెనగల్లో బి6, జింక్‌ పుష్కలంగా ఉండటం వల్ల.. జుట్టు రాలిపోయే సమస్య అదుపులో ఉంటుంది. అలాగే చిన్నవయసులోనే జుట్టు తెల్లగా మారడాన్ని నిరోధిస్తాయి.

* ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే తామర వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే.. నానబెట్టిన సెనగలు మంచి ఔషధం.

* ఇనుము, క్యాల్షియం లోపం రాకుండా చూసి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని