పింక్‌ సాస్‌.. ట్రెండింగ్‌!

సాస్‌ ఏరంగులో ఉంటుంది? ఇదో ప్రశ్నా.. ఎరుపు! అనేగా మీ సమాధానం. అయితే ఈ మధ్య సోషల్‌మీడియాలో గులాబీరంగుంలో ఉన్న పింక్‌సాస్‌ సందడి చేస్తుంది. అటు నెటిజన్లు... ఇటు పోషకాహార నిపుణులు ఇంతగా ఈ సాస్‌ గురించి చర్చించుకోవడానికి

Published : 31 Jul 2022 00:52 IST

సాస్‌ ఏరంగులో ఉంటుంది? ఇదో ప్రశ్నా.. ఎరుపు! అనేగా మీ సమాధానం. అయితే ఈ మధ్య సోషల్‌మీడియాలో గులాబీరంగుంలో ఉన్న పింక్‌సాస్‌ సందడి చేస్తుంది. అటు నెటిజన్లు... ఇటు పోషకాహార నిపుణులు ఇంతగా ఈ సాస్‌ గురించి చర్చించుకోవడానికి కారణం దాని రంగు. చెఫ్‌పై అనే టిక్‌టాకర్‌ మొదటిసారి ఈ సాస్‌ని తయారుచేసి ఓ పోస్ట్‌ పెట్టింది. పోస్టుకు లక్షల్లో వ్యూస్‌ రావడంతో ఆ పింక్‌సాస్‌ మాకూ కావాలంటూ చెఫ్‌పైని జనాలు అడగడం మొదలుపెట్టారు. ఆర్డర్లు వెల్లువెత్తడంతోపాటు దానికా రంగు ఎలా వచ్చింది.. ఏవి పడితే అవి అలా తినేస్తారా? అనేవారి సంఖ్యా పెరిగింది. దాంతో పై అందులో తను వాడిన సీక్రెట్‌ పదార్థం డ్రాగన్‌ఫ్రూట్‌ గురించి చెప్పకతప్పలేదు. ఈ చర్చ వల్ల చెఫ్‌పైకి అటు సోషల్‌మీడియా అభిమానులు పెరగడంతోపాటూ వ్యాపారం ఊపందుకుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని