దాల్‌ మహారాణి.. బెండీ కుర్‌కురే!

3500 రకాల చిరుతిళ్లు..   700 రకాల వంటకాల్లో..  ఏది తినాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు దేశవిదేశాల నుంచీ తమిళనాడుకు వచ్చిన చెస్‌ క్రీడాకారులు.. 

Published : 07 Aug 2022 01:11 IST

3500 రకాల చిరుతిళ్లు..   700 రకాల వంటకాల్లో..  ఏది తినాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు దేశవిదేశాల నుంచీ తమిళనాడుకు వచ్చిన చెస్‌ క్రీడాకారులు.. 

దాల్‌ మహారాణి, బెండీ కుర్‌కురే... ఇడ్లీలు, మసాలా దోసెలతో మొదలుపెట్టి ఆసియా, ఐరోపాకు చెందిన 3500 రకాల వంటకాలని చెస్‌ ఒలింపియాడ్‌ కోసం వచ్చిన అతిథులకు వండి వారుస్తున్నారు. ఈ పోటీలకు కోసం వచ్చే అతిథులకు వడ్డించిన రకాలని వడ్డించకుండా విభిన్న రకాలని అందించాలని ముందే నిర్ణయించుకున్నారు 75 ఏళ్ల చెఫ్‌ జీఎస్‌ తల్వార్‌. ఆయన ఆధ్వర్యంలో వారం రోజుల కసరత్తు చేస్తే ఈ వంటల జాబితా తయారయ్యిందట. ఈ పోటీలకు విచ్చేసిన వాల్‌డెర్‌ వెల్డె ప్రముఖ చెస్‌ క్రీడాకారుడు మాత్రమే కాదు మంచి పాకశాస్త్ర విమర్శకుడు కూడా. ఇంతవరకూ తను తిన్నవాటిల్లో మసాలా దోసె, గోబీ మంచూరియా, ఫ్రైడ్‌రైస్‌, వడలు, వాతకొళంబు వంటకాలు తెగ నచ్చేశాయట. ముఖ్యంగా అడయార్‌, ఆనంద్‌ భవన్‌, చెట్టినాడు వంటకాలకు ఫిదా అయిపోయానంటున్నాడు వాల్‌డెర్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని