రాళ్లపై కాలుస్తారు!

చపాతీని మీరెలా కాలుస్తారు? ‘అదేం ప్రశ్న అందరిలానే పెనంమీద’ అంటారా! కానీ ఈ సంగక్‌ రోటీని గులక రాళ్లపైన కాలుస్తారు.

Updated : 22 Jan 2023 02:36 IST

చపాతీని మీరెలా కాలుస్తారు? ‘అదేం ప్రశ్న అందరిలానే పెనంమీద’ అంటారా! కానీ ఈ సంగక్‌ రోటీని గులక రాళ్లపైన కాలుస్తారు. అదే దీని ప్రత్యేకత....

వేడివేడి రాళ్లపైన కాల్చే సంగక్‌ బ్రెడ్‌... పర్షియా ప్రత్యేకం. 11వ శతాబ్దం నాటి వంటకం ఇది. నదిలో ఉండే గులకరాళ్లని తెచ్చి వాటిని పెద్దపెద్ద అవెన్‌లలో పోసి వేడి చేస్తారు. వాటిపై  రొట్టెలని ఉంచి కాలుస్తారు. దాంతో వాటి ఆకృతి చూడ్డానికి భిన్నంగా ఉంటుంది. మొదట్లో వీటిని సైనికుల కోసం మాత్రమే చేసేవారు. తర్వాత ఇవి తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత రాకుండా ఉంటుందని భావించి పిల్లలకీ¨ తినిపించేవారు. క్రమంగా సామాన్యులకూ చేరువైందీ సంగక్‌ రోటీ. ప్రస్తుతం వీటిని మన దేశంలో కూడా రెస్టరంట్లలో అందిస్తున్నారు. పెబల్‌ రోటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరు ఏదైనా నువ్వులు అద్దిన పెబల్‌ రోటీల రుచి భలే ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని