ఇడ్లీలతో ఇంకో ప్రయోగం!

నెలలో ఇరవై రోజులు తిన్నా విసుగేయని టిఫిన్‌ ఇడ్లీ. దేశంలో ఎక్కువమంది ‘బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ’అని కితాబులిస్తారు కూడా. నూనెలో మునిగి తేలే పూరీలు, దోశల్లా కాకుండా ఆవిరిమీద ఉడుకుతుంది కనుక ఆరోగ్యానికి మంచిది.

Updated : 17 Dec 2023 03:20 IST

నెలలో ఇరవై రోజులు తిన్నా విసుగేయని టిఫిన్‌ ఇడ్లీ. దేశంలో ఎక్కువమంది ‘బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ’అని కితాబులిస్తారు కూడా. నూనెలో మునిగి తేలే పూరీలు, దోశల్లా కాకుండా ఆవిరిమీద ఉడుకుతుంది కనుక ఆరోగ్యానికి మంచిది. వేడి వేడి ఇడ్లీలు పల్లీ పచ్చడి, కారప్పొడి.. ఇలా దేంతో తిన్నా సూపర్‌గా ఉంటాయి. ఎంత బాగుంటే మాత్రం.. ఎప్పుడూ ఒకేలా ఎందుకుండాలని ఇడ్లీలతోనూ  ప్రయోగాలు చేస్తుంటారు పాకశాస్త్ర ప్రవీణులు.  

 తాజాగా ఒక ఫుడ్‌ వెండర్‌ యాపిల్‌ ఇడ్లీలను తయారు చేశాడు. ఎలాగంటే.. పిండిలో యాపిల్‌ ముక్కలు కలిపి, ఉడికించాడు. ఆ ఇడ్లీల మీద దానిమ్మ గింజలు చల్లి.. సాంబార్‌, కొబ్బరి, పుదీనా, టొమాటో పచ్చళ్లతో వడ్డించాడు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫుడీ’ అకౌంట్‌లో ‘ఇడ్లీస్‌ విత్‌ యాపిల్స్‌’ పేరుతో పోస్ట్‌ అయిన ఈ వీడియో వైరలైంది. దాదాపు తొమ్మిది లక్షల వ్యూస్‌, 5,400 లైక్స్‌ వచ్చాయి.

 ‘ఆరోగ్యాన్ని మరింత పెంచే కొత్త ప్రయోగం’ అంటూ దీన్ని సోషల్‌ మీడియాలో తెగ మెచ్చుకుంటున్నారు. ఆ ప్రశంసలతో పాటు.. ‘బంగారం లాంటి ఇడ్లీని అనవసరంగా చెడగొడుతున్నారు’- అంటూ విమర్శలు కూడా వెల్లువెత్తాయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని