నాలుగు పండ్లూ ఒక్కటయ్యాయి!

జామ, మామిడి, సపోటా.. ఇలా మనకు తెలిసిన పండ్లు అనేకం ఉన్నాయి. అయితే మనం వినని, చూడని పండ్లు కూడా ఇంకెన్నో ఉన్నాయి.

Updated : 31 Dec 2023 07:26 IST

జామ, మామిడి, సపోటా.. ఇలా మనకు తెలిసిన పండ్లు అనేకం ఉన్నాయి. అయితే మనం వినని, చూడని పండ్లు కూడా ఇంకెన్నో ఉన్నాయి. వాటిల్లో ‘అకేబీ’ ఒకటి. వంకాయ రంగులో ఉండే ఈ పండు లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఇందులో క్వినాటా, ట్రిఫోలియాటా- అంటూ రెండు రకాలున్నాయి. ఈ పండును బాగుందంటూ ఇష్టంగా తినేవారితో పాటు బొత్తిగా బాగాలేదని వెగటుగా ముఖం పెట్టేవారూ ఉన్నారు. మెచ్చినవాళ్లు దీని గుజ్జు లిచీ, డ్రాగన్‌ ఫ్రూట్‌, పాషన్‌ ఫ్రూట్‌, అరటిపండ్లను కలగలిపి చేసినట్లు తియ్యగా ఉంటుందంటారు. అకేబీ జపాన్‌లో పండుతుంది. స్నోఫాల్‌ మొదలైన మొదటి రెండు వారాల్లో మాత్రమే లభ్యమవుతుంది. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు డీప్‌ ఫ్రై చేసి కూర రూపంలో తింటారు. దోసకాయలా ఊరగాయ పచ్చడికీ ఇది అనుకూలమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని