కమ్మటి క్యాప్సికం రింగ్స్‌..

మామూలు రోజుల్లో రొటీన్‌ వంటలతో గడిచిపోతుంది కానీ..  సెలవు రోజుల్లో మాత్రం పిల్లలు ఏమైనా స్పెషల్‌ కావాలని పేచీ పెడుతుంటారు. వాళ్ల కోసం నేనూ ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాను.

Published : 13 Jan 2024 23:51 IST

మామూలు రోజుల్లో రొటీన్‌ వంటలతో గడిచిపోతుంది కానీ..  సెలవు రోజుల్లో మాత్రం పిల్లలు ఏమైనా స్పెషల్‌ కావాలని పేచీ పెడుతుంటారు. వాళ్ల కోసం నేనూ ఏవో చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాను. అలా తయారైనవే ఈ ‘కార్న్‌ క్యాప్సికం రింగ్స్‌’. మా వాళ్లకి నచ్చింది కాబట్టి మీతో పంచుకుంటు న్నాను. ఇవెలా చేయా లంటే.. ముందుగా క్యాప్సికమ్‌లను కడిగి,  తుడవాలి. లోపలి విత్తనాలు తీసేసి, చక్రాలుగా కోసి పక్కనుంచాలి. ఒక పాత్రలో రెండు కప్పుల పెరుగు, కప్పు ఉప్మారవ్వ తీసుకుని.. అందుకు తగ్గట్టుగా కారం, ఉప్పు, ఛాట్‌ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్టు, స్వీట్‌కార్న్‌, పనీర్‌, ఉల్లి, టొమాటో, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. పెనం మీద కాస్త నూనె వేసి కొన్ని క్యాప్సికమ్‌ రింగ్స్‌ పరిచి, వాటి మధ్యలో రవ్వ మిశ్రమం పట్టినంత వేసి.. మూత పెట్టాలి. గోధుమ రంగులోకి మారాయి అనుకున్నాక.. తిరగేసి, అటు కూడా వేయించాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాదు, రుచిలో అమోఘం అనిపిస్తాయి. ఒకసారి చేసి చూడండి.. పిల్లలూ, పెద్దలూ అందరికీ నచ్చేస్తాయి.  

- పోతన జ్యోతి, చింతల్‌, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని