పసందైన కఢీ పకోడీ

మనందరికీ పకోడీ బాగా నచ్చుతుంది కదా! పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో మట్టుకు ‘కఢీ పకోడీ’ ఇష్టంగా తింటారు. పకోడీల వరకూ సాధారణమే. మరి కఢీ పకోడీలు ఎలా చేస్తారంటే..

Published : 28 Jan 2024 00:29 IST

నందరికీ పకోడీ బాగా నచ్చుతుంది కదా! పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో మట్టుకు ‘కఢీ పకోడీ’ ఇష్టంగా తింటారు. పకోడీల వరకూ సాధారణమే. మరి కఢీ పకోడీలు ఎలా చేస్తారంటే.. కప్పు శనగపిండిలో కప్పు ఉల్లిపాయ చీలికలు, తగినంత ఉప్పు, పావు కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి ఎంతమాత్రం జారుగా ఉండకూడదు. ఆ గట్టి పిండితో పకోడీలు వేయించుకోవాలి. ఇక కఢీ కోసం కప్పున్నర పుల్లటి పెరుగులో తగినంత ఉప్పు, పావు కప్పు శనగపిండి, అర చెంచా చొప్పున కారం, పసుపు, వాము వేసి కలపాలి. పల్చగా అయ్యేందుకు మూడు కప్పుల నీళ్లు పోసి.. బ్లెండ్‌ చేయాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు, ఇంగువలతో తాలింపు వేయాలి. ఆవాలు చిటపటలాడాక.. ఉల్లి, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, మూడు నిమిషాలు వేయించాలి. అందులో పెరుగు మిశ్రమం వేసి కలియ తిప్పి, పావు గంట ఉడికించి, దించేయాలి. అందులో పకోడీలు వేసి, గరం మసాలా చల్లాలి. అంతే.. కఢీ పకోడీ తయారైపోతుంది. మామూలు పకోడీలకు మరింత రుచి తెప్పించే ఈ కఢీ పకోడీ మనమూ చేసుకుందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు