సేమ్యాతో క్షణాల్లో దోశలు

దోశలు వేసుకోవాలంటే ముందు రోజు మినప్పప్పు, బియ్యం నానబెట్టి, పిండి రుబ్బుకోవాలి. ఒక్కోసారి పిండి సిద్ధంగా లేక.. అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనుకున్నా- చాలానే పద్ధతులున్నాయి.

Updated : 28 Jan 2024 06:07 IST

దోశలు వేసుకోవాలంటే ముందు రోజు మినప్పప్పు, బియ్యం నానబెట్టి, పిండి రుబ్బుకోవాలి. ఒక్కోసారి పిండి సిద్ధంగా లేక.. అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలి అనుకున్నా- చాలానే పద్ధతులున్నాయి. వాటిల్లో ఒకటి సేమ్యా దోశ. ఇది ఇన్‌స్టంట్‌ కనుక.. రుచి తగ్గుతుందేమో అనుకోకండి. కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయివి. ఇంతకీ వీటినెలా చేయాలంటే.. ముందుగా కప్పు సేమ్యాలో కప్పు ఉప్మారవ్వ వేసి గ్రైండ్‌ చేయాలి. అందులో కప్పున్నర పెరుగు, కొన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కాగిన పెనం మీద దోశ వేయాలి. కొంచెం కాలిన తర్వాత టొమాటో సాస్‌ వేసి.. అల్లం, ఉల్లి, పచ్చి మిర్చి ముక్కలు చల్లాలి. ఇంకో నాలుగు క్షణాలుంచి తీసేయాలి. మిగిలిన పిండితోనూ ఇలాగే దోశలు వేసు కోవాలి. ఘుమఘుమలాడే సేమ్యా దోశలకు పల్లీ లేదా కొబ్బరి పచ్చడి సూపర్‌ కాంబినేషన్‌. మామూలు దోశలకు భిన్నంగా ఉండే వీటిని మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే మీరూ ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని