ఈ బజ్జీలు మహా రుచి

నూనెతో పనిలేని ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పిల్లలకు పెద్దగా నచ్చవు కనుక కొన్ని సార్లు మిగిలి పోతుంటాయి. వాటిని పడేయాలంటే బాధేస్తుంది కదా!

Published : 18 Feb 2024 00:03 IST

నూనెతో పనిలేని ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పిల్లలకు పెద్దగా నచ్చవు కనుక కొన్ని సార్లు మిగిలి పోతుంటాయి. వాటిని పడేయాలంటే బాధేస్తుంది కదా! అలాంటప్పుడు ఇడ్లీలతో ఉప్మా, ఛాట్‌ లాంటి స్నాక్స్‌ చేసుకోవచ్చు. నేను ఇడ్లీలతో బజ్జీలు వేస్తాను. ఎలాగంటే.. ముందుగా ఇడ్లీలను ముక్కలుగా చేసుకోవాలి. శనగపిండిలో కారం, ఉప్పు, వాము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌ పౌడర్‌, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి.. కొన్ని నీళ్లతో పిండి కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా జారుగా ఉండకూడదు. ఇడ్లీ ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి.. కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి మారాక.. టిష్యూ కాగితం మీదికి తీస్తే అదనపు నూనె పీల్చేసుకుంటాయి. అంతే.. కాస్త ఛాట్‌ మసాలా చల్లి వడ్డించేయొచ్చు. ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం జోడించవచ్చు. ఇవెంతో క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. పిల్లలూ పెద్దలూ కూడా ఇంకా కావాలంటారు. నచ్చితే మీరూ చేసి చూడండి!

 సంగీతా మైస్కర్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని