కరకరలాడే రైస్‌ బాల్స్‌!

ఆదివారం వచ్చిందంటే కబుర్లూ కాలక్షేపాలే కాదు.. కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలి అనిపిస్తుంది. అందుకే ఎవరికి వారు.. రొటీన్‌ వంటలకు భిన్నంగా ఏవో ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త వెరైటీలు చేయడం నాక్కూడా చాలా ఇష్టం.

Updated : 25 Feb 2024 04:38 IST

పాఠక వంట

దివారం వచ్చిందంటే కబుర్లూ కాలక్షేపాలే కాదు.. కొత్త కొత్త రుచులు ఆస్వాదించాలి అనిపిస్తుంది. అందుకే ఎవరికి వారు.. రొటీన్‌ వంటలకు భిన్నంగా ఏవో ప్రయోగాలు చేస్తుంటారు. కొత్త వెరైటీలు చేయడం నాక్కూడా చాలా ఇష్టం. అలా ప్రయత్నించిందే రైస్‌ బాల్స్‌. ఎలా చేయాలంటే.. ఒక కప్పు బియ్యం కడిగి.. వేడినీళ్లలో నానబెట్టాలి. గంట తర్వాత.. నానిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అందులో ఉడికించి, పొట్టు తీసిన మూడు బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు పావు కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు, ఒక చెంచా అల్లం ముద్ద, ఇంకో చెంచా జీలకర్ర, పావు చెంచా వాము వేసి.. బాగా కలపాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత ఈ బియ్యప్పిండితో చిన్న చిన్న బాల్స్‌లా చేసి.. బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. శనగ పిండి కాదు కనుక కడుపుబ్బరం కూడా ఉండదు. నచ్చితే మీరూ చేసి చూడండి.

దేవినేని శ్రీలక్ష్మి, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని