గులాబీ దోశ ఘుమఘుమలు

జైపుర్‌ని ‘పింక్‌ సిటీ’ అంటారని తెలుసు కదా! ఇక్కడ ఇళ్లన్నీ గులాబీ రంగులో ఉంటాయి కదా.. దోశలు మాత్రం అలా ఎందుకు ఉండకూడదు- అనుకున్నాడో పాకశాస్త్ర నిపుణుడు. ఆ ఊహని నిజం చేసేశాడు.

Updated : 25 Feb 2024 04:36 IST

వారెవా

జైపుర్‌ని ‘పింక్‌ సిటీ’ అంటారని తెలుసు కదా! ఇక్కడ ఇళ్లన్నీ గులాబీ రంగులో ఉంటాయి కదా.. దోశలు మాత్రం అలా ఎందుకు ఉండకూడదు- అనుకున్నాడో పాకశాస్త్ర నిపుణుడు. ఆ ఊహని నిజం చేసేశాడు. వివరాల్లోకి వెüË™్త... జైపుర్‌ బజాజ్‌ నగర్‌ హనుమాన్‌ మందిరం దగ్గర్లో ‘బాలాజీ ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌’ ఉంది. అందులో పనిచేస్తున్న ఛెఫ్‌ జైపుర్‌లో గులాబీ రంగు నిర్మాణాల్లా పింక్‌ దోశల కోసం ఆలోచించి.. పిండిలో బీట్‌రూట్‌ రసం కలిపాడు. అంతే ఆకర్షణీయమైన గులాబీ దోశ తయారైంది. చీజ్‌, సాస్‌లు, మసాలాల టాపింగ్‌తో.. ఘుమఘుమలాడే దోశ పైన ఇంకోసారి చీజ్‌ను స్పింకిల్‌ చేసి, సాంబార్‌ బౌల్‌తో సర్వ్‌ చేస్తాడు. ఈ దోశలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. రంగూ, రుచీ కూడా అదుర్స్‌ అనేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని