అవెన్‌లో పేలాలు

పాప్‌కార్న్‌ ఇష్టపడనివాళ్లుంటారా?! ఇవి కొని తినడమే గానీ ఇంట్లో చేసుకోవడం కష్టం కదూ! కానీ ఇప్పుడా బాధ లేదు. ‘అవెన్‌ పాప్‌కార్న్‌ పాపర్‌’ వచ్చేసింది.

Published : 03 Mar 2024 00:42 IST

పాప్‌కార్న్‌ ఇష్టపడనివాళ్లుంటారా?! ఇవి కొని తినడమే గానీ ఇంట్లో చేసుకోవడం కష్టం కదూ! కానీ ఇప్పుడా బాధ లేదు. ‘అవెన్‌ పాప్‌కార్న్‌ పాపర్‌’ వచ్చేసింది. ఎండిన మొక్కజొన్న గింజలను ఈ జార్‌లో వేస్తే మూడు నిమిషాల్లోపే పేలాలైపోతాయి. నూనె లేదా నెయ్యి జోడించనవసరం లేదు కనుక ఆరోగ్యానికీ మంచిది. బోరోసిలికేట్‌ గ్లాస్‌తో రూపొందిన ఈ పరికరం ప్రమాదాలకు తావీయదు, ఎక్కువకాలం మన్నుతుంది. కబోర్డ్‌లో పెద్దగా స్థలం కూడా ఆక్రమించదు. దీన్ని డిష్‌వాషర్‌తోనూ శుభ్రం చేయొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని