జీడికాయలు కాల్చి.. తేనెలో ముంచి..

కడాయిలో వేయించిన పల్లీల కంటే వేరుశనక్కాయలకు మంట పెడితే.. అలా వేగిన పప్పులు మరింత రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో జీడికాయలకు కూడా అలాగే మంటపెడతారు.

Published : 03 Mar 2024 00:44 IST

డాయిలో వేయించిన పల్లీల కంటే వేరుశనక్కాయలకు మంట పెడితే.. అలా వేగిన పప్పులు మరింత రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో జీడికాయలకు కూడా అలాగే మంటపెడతారు. ఎండిన కొబ్బరాకుల మధ్య జీడికాయలుంచి.. ఆ ఆకుల్ని తాడుతో కట్టేసి నిప్పు రగిలిస్తారు. అలా కాలిన కాయల్ని పగలగొడితే.. గింజలు ఎంచక్కా వేగి.. కొంచెం గోధుమ రంగులో నోరూరేలా ఉంటాయి. వాటిని ఓ గిన్నెలో వేసి.. కాస్తంత తేనె కలిపి తింటుంటే.. వారెవా అనకుండా ఉండగలమా?! ‘శ్రీలంకకు చెందిన ట్రెడిషనల్‌ ఫుడ్‌ హోమ్‌’ పోస్ట్‌ చేసిన ఈ వీడియోను మీరూ చూసి ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని