ఇది పేదల టొమాటో!

టామరిల్లో.. గుబురుగా పెరిగే చిన్న చెట్టు. ఈ పండ్లు గుడ్డు ఆకారంలో ఉంటాయి. దీనికి ట్రీ టొమాటో, పేదల టొమాటో, టొమేట్‌ ఆండినో, టొమేట్‌ సెరానో, బ్లడ్‌ ఫ్రూట్‌, సచటోమేట్‌, బెరెంజెనా, చిల్టో, టొమామోరో.

Published : 03 Mar 2024 00:46 IST

టామరిల్లో.. గుబురుగా పెరిగే చిన్న చెట్టు. ఈ పండ్లు గుడ్డు ఆకారంలో ఉంటాయి. దీనికి ట్రీ టొమాటో, పేదల టొమాటో, టొమేట్‌ ఆండినో, టొమేట్‌ సెరానో, బ్లడ్‌ ఫ్రూట్‌, సచటోమేట్‌, బెరెంజెనా, చిల్టో, టొమామోరో.. ఇలా చాలానే పేర్లున్నాయి. ఇది న్యూజిలాండ్‌, నేపాల్‌, రువాండా, బురుండి, ఆస్ట్రేలియా, బూటాన్‌, దక్షిణాఫ్రికా, హాంగ్‌కాంగ్‌, అమెరికాల్లో విస్తారంగా పండుతుంది. మనదేశంలో నాగాలాండ్‌, మణిపుర్‌, డార్జిలింగ్‌, సిక్కిం ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. ఈ చెట్లు 5 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. పండ్లు ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో ఉంటాయి. ఎర్రటివి పుల్లగా, పసుపు, నారింజ రంగు పండ్లు తియ్యగా ఉంటాయి. విత్తనాలు అచ్చం దానిమ్మ గింజల్లా ఉంటాయి. వీటిల్లో ఐరన్‌, కాల్షియం, మెగ్నీషియం, ఎ,సి-విటమిన్లు ఉంటాయి.  ఈ పండ్ల గుజ్జును అలాగే తింటారు. లేదా టోస్ట్‌, సలాడ్‌లానూ తింటారు. జ్యూస్‌ కూడా చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని