చికెన్‌ డోనట్స్‌ చేయడం తేలికే!

సాయంత్రం వేళ చికెన్‌ డోనట్స్‌ తింటే బాగుంటుంది కదూ! ఇవి పార్టీ స్టార్టర్స్‌ కూడా.

Published : 24 Mar 2024 00:03 IST

సాయంత్రం వేళ చికెన్‌ డోనట్స్‌ తింటే బాగుంటుంది కదూ! ఇవి పార్టీ స్టార్టర్స్‌ కూడా. ఈ డోనట్స్‌ను సులభంగా తయారు చేసే విధానం చూడండి..

కావలసినవి: చికెన్‌ కీమా - పావు కిలో, వెల్లుల్లి తరుగు - చెంచా, బంగాళదుంప - ఒకటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు చొప్పున, క్యారెట్లు - 2, చిల్లీ ఫ్లేక్స్‌, జీలకర్ర పొడి, బ్లాక్‌ పెప్పర్‌ పౌడర్‌ - పావు చెంచా చొప్పున, కారం - అర చెంచా, ఉప్పు - తగినంత, మైదా పిండి, బ్రెడ్‌ పౌడర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, గుడ్డు - ఒకటి, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: ముందుగా బంగాళదుంపలు ఉడికించాలి. కారెట్లను తురమాలి. చికెన్‌, వెల్లుల్లి, బ్రెడ్‌ పొడి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ తురుము, కారం, చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు, జీలకర్ర పొడి, బ్లాక్‌ పెప్పర్‌Ë పొడి, కొత్తిమీరలను బ్లెండర్‌ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్టుగా చేసుకోండి. ఒక ప్లేట్‌లో నూనె రాసి.. చికెన్‌ పేస్ట్‌ను వడల ఆకృతిలో చేసి.. 3 గంటలు ఫ్రీజర్‌లో ఉంచండి. ఒక గిన్నెలో గిలకొట్టిన గుడ్డు, మరో గిన్నెలో మైదాపిండిని సిద్ధంగా ఉంచండి. కడాయిలో నూనె వేడి చేయండి. ఫ్రీజ్‌ చేసిన చికెన్‌ డోనట్స్‌ను ఒక్కొక్కటిగా ముందు గుడ్డు సొనలో, తర్వాత మైదాపిండిలో ముంచి.. ఆపై నూనెలో వేయండి! మీడియం మంట మీద బంగారు రంగులోకి మారాక తీస్తే.. రుచికరమైన ‘చికెన్‌ డోనట్స్‌’ రెడీ. వడ్డించి, ప్రశంసలు అందుకోండి.

పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని