చూపునిచ్చే నల్లద్రాక్ష!

నిగనిగలాడే నల్లద్రాక్షలని చూస్తే నోరూరుతుంది కదా! చూడగానే చటుక్కున నోట్లో వేసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం కష్టమే!.

Published : 29 Jan 2023 00:04 IST

నిగనిగలాడే నల్లద్రాక్షలని చూస్తే నోరూరుతుంది కదా! చూడగానే చటుక్కున నోట్లో వేసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవడం కష్టమే!. ఇవి రుచిలోనే కాదు పోషకాల్లోనూ ప్రత్యేకమైనవే...

* నల్లద్రాక్షలోని లూటిన్‌, జియాంతిన్‌ అనే కెరోటినాయిడ్లు రెటీనాకి రక్షణ కవచంలా నిలిచి అంధత్వం రాకుండా కాపాడతాయట. ఇవి లభించే రోజుల్లో విరివిగా తినడం మంచిదని అంటున్నాయి అధ్యయనాలు.

* రెస్‌వెట్రాల్‌ అనే రసాయనం రొమ్ముక్యాన్సర్‌ సహా అనేక రకాల క్యాన్సర్లని రాకుండా నివారిస్తుంది. క్యాన్సర్‌ కణాల ఎదుగుదలని అడ్డుకుంటుంది.

* డెమెన్షియా వంటి సమస్యలతో బాధపడేవారికి ద్రాక్ష మంచి మందు. మెదడులోని కణాలు దెబ్బతినకుండా ద్రాక్షలోని ప్రత్యేక రసాయనాలు రక్షణ కవచంలా నిలుస్తాయి.

* చిన్న వయసులో జుట్టు నెరిసిపోవడం, అతిగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు చెక్‌పెడుతుంది నల్లద్రాక్ష. వీటిల్లోని ఇ విటమిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

* నల్లద్రాక్షలోని రెస్‌వెట్రాల్‌ అనే రసాయనం ఎముకలు అరిగిపోవడం, గుల్లబారడం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

* నిద్రపోయేముందు రెండు ద్రాక్ష పళ్లు తిన్నా మంచి నిద్ర పడుతుంది. కారణం నిద్రకు సహకరించే మెలటోనిన్‌ హార్మోన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే జీవితకాలం కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని