పాన్‌ బనారస్‌ వాలా..

ఆధ్యాత్మిక కేంద్రం బెనారస్‌ అదేనండీ వారణాసి వివిధ రకాల వంటకాలకీ ప్రసిద్ధి. ముఖ్యంగా పాన్‌లకి పెట్టింది పేరు. అమితాబ్‌ నటించిన ‘కైకే పాన్‌ బెనారస్‌ వాలా..’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందేగా!

Published : 12 Feb 2023 00:40 IST

ఆధ్యాత్మిక కేంద్రం బెనారస్‌ అదేనండీ వారణాసి వివిధ రకాల వంటకాలకీ ప్రసిద్ధి. ముఖ్యంగా పాన్‌లకి పెట్టింది పేరు. అమితాబ్‌ నటించిన ‘కైకే పాన్‌ బెనారస్‌ వాలా..’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందేగా! పాన్‌తో పాటు అక్కడ దొరికే ఆ వంటకాలేంటో తెలుసుకుందాం రండి...

సబ్జి కచోరీ: వేడివేడి కచోరీలు వాటితో పాటే వేడి ఆలూకూర వారణాసి ప్రత్యేకం. ఒక్క కచోరీ తిన్నా చాలు కడుపు నిండిపోతుంది. అంత రుచిగా, పెద్దగా ఉంటాయివి.

చెనాదహీవడా: తీయని పెరుగులో ముంచిన వడలు.. జీలకర్రపొడి, నల్లుప్పు రుచితో భలే ఉంటాయి.

బట్టీచోకా: గోధుమపిండితో చేసిన చిన్నచిన్న ముద్దలని బొగ్గులమీద కాల్చి, వంకాయ కూరతో పెడుతుంటారు. వారణాసిలో ఏ మూలకెళ్లినా వేడివేడి బట్టీ చోకాలు దొరుకుతాయి.

బనారసీ తండాయి: చిక్కని పాలతో చేసిన లస్సీలు వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లతో దొరకడం ఈ లస్సీల ప్రత్యేకం.

చూడా మటర్‌: అటుకులని వేయించి, పచ్చి బఠాణీలతో చేసే వంటకం ఇది. ఇంగువ, మిరియాలపొడి వేసి చేసే ఈ వంటకాన్ని పర్యటకులు చాలా ఇష్టంగా తింటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని