చల్లటి చలిలో వెచ్చటి ‘కాంగ్‌షోయీ’

ఈ కాలంలో మణిపుర్‌ చలికి గజగజలాడుతుంది. ఇలాంటి చల్లటి చలిలో వెచ్చటి కాంగ్‌షోయీవాతావరణంలో వాళ్లు వెచ్చగా ‘కాంగ్‌షోయీ’ సూప్‌ తాగుతుంటారు

Published : 14 Jan 2024 00:30 IST

ఈ కాలంలో మణిపుర్‌ చలికి గజగజలాడుతుంది. ఇలాంటి చల్లటి చలిలో వెచ్చటి కాంగ్‌షోయీవాతావరణంలో వాళ్లు వెచ్చగా ‘కాంగ్‌షోయీ’ సూప్‌ తాగుతుంటారు. ఇదక్కడ చాలా ప్రసిద్ధం. కాంగ్‌షోయీ పదానికి మేళవింపు లేదా కలగలపడం అనే అర్థాలున్నాయి. ఆయా కాలాల్లో దొరికే కూరగాయలను కలగలిపి చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది. ఇంతకీ దీన్నెలా చేస్తారంటే.. బంగాళదుంపల చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లి, టొమాటోలు, పచ్చి మిరపకాయలు, బచ్చలి కూరలను తరగాలి. అల్లం, వెల్లుల్లి నూరుకోవాలి. వీటికి పచ్చి బఠాణీలను జతచేసి ఉడికించాలి. తర్వాత బచ్చలి తరుగు, ఉప్పు వేయాలి. కొంచెం ఎక్కువే నీళ్లు పోసి సూప్‌లా చేసుకోవాలి. ఎంతో సులువుగా తయారయ్యే ఈ వంటకం అద్భుతమైన రుచీ వాసనలతో అదిరిపోతుంది. మంచి పోషకాహారం కూడా. ఇవే కూరగాయలు వాడాలనే నియమం లేదు. అందుబాటులో ఉన్నవాటిల్లో నచ్చినవాటితో చేయొచ్చు. మనం దోస, చిక్కుడు, టొమాటో, వంకాయ, చిలకడదుంప, ములక్కాయలతో కలగూరగంప చేసుకుంటాం కదా! అలాగే మణిపుర్‌ వాసులకు కాయగూరలతో కాంగ్‌షోయీ సూప్‌ చేసి, ఇష్టంగా సేవిస్తారు. ఇది వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు, రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని