ఎండ నుంచి రక్షగా!

ఎండలు ఎంతలా మండిపోతున్నా మనం బయటకు వెళ్లి తీరాల్సిందే! అలా వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ని తీసుకెళ్తున్నారా? అందులో ఉత్తనీరుని కాకుండా ఇవి కూడా జోడించండి.

Updated : 21 May 2023 00:40 IST

ఎండలు ఎంతలా మండిపోతున్నా మనం బయటకు వెళ్లి తీరాల్సిందే! అలా వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ని తీసుకెళ్తున్నారా? అందులో ఉత్తనీరుని కాకుండా ఇవి కూడా జోడించండి. ఎండ నుంచి ఉపశమనంతోపాటు పోషకాలు కూడా అందుతాయి..

* నీటికి కొద్దిగా తేనె, నిమ్మరసం, దంచిన అల్లం కలిపితే... శరీరం నుంచి వ్యర్థాలు బయటకుపోవడంతోపాటు వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలుంటే తొలగిపోతాయి.

* తరిగిన కీరాదోస ముక్కలు, కచ్చాపచ్చాగా దంచిన పుదీనా ఆకులు కలిపిన నీళ్లు తాగితే ఎండ నుంచి ఉపశమనంతోపాటు, శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. బరువు తగ్గడంతోపాటు హైబీపీ నుంచి ఉపశమనం ఉంటుంది.

* సన్నగా తరిగిన పైనాపిల్‌ ముక్కలు, కొబ్బరిముక్కలు వీటిని నీటికి జోడించి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి తెల్లారి తాగి చూడండి. శరీరానికి మేలు చేసే కొవ్వులు అందడంతోపాటు... ఎండ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే ఎలక్ట్రోలైట్లు అందుతాయి.

* దానిమ్మ గింజలు, దాల్చిన చెక్క వీటిని కలిపి తాగితే బీపీ తగ్గి.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

* సన్నగా చక్రాల్లా తరిగిన ఆరెంజ్‌ స్లైసులని నీళ్లలో కలిపి తాగితే బరువు తగ్గడంతోపాటు.. శరీరం ఎక్కువ సేపు తేమగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని