ఆందోళన తగ్గించే కమలాలు

ఆరెంజి రంగులో చూడముచ్చటగా ఉంటాయి కదూ కమలాపండ్లు. ఇవి ఆరోగ్యపరంగా అద్భుతమనే చెప్పాలి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, పీచు, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం, సిట్రిక్‌ యాసిడ్‌, క్యాల్షియం- ఇలా శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి.

Published : 31 Dec 2023 00:30 IST

రెంజి రంగులో చూడముచ్చటగా ఉంటాయి కదూ కమలాపండ్లు. ఇవి ఆరోగ్యపరంగా అద్భుతమనే చెప్పాలి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, పీచు, ఫోలిక్‌ యాసిడ్‌, పొటాషియం, సిట్రిక్‌ యాసిడ్‌, క్యాల్షియం- ఇలా శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి. ఫాట్‌ అనేది లేదు. కమలాల్లో విస్తారంగా ఉన్న సి-విటమిన్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పి, గాయాలను తగ్గిస్తుంది. వైరస్‌లు దరిచేరకుండా రక్షణ కల్పిస్తుంది. కమలాలు తినడం వల్ల చర్మ నిగారింపు పెరుగుతుంది. ఉబ్బసం, ఆర్థరైటిస్‌ల నుంచి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా పని చేస్తుంది. మలబద్ధకం సమస్య తలెత్తదు. కంటి చూపు మెరుగుపడుతుంది. వాంతులు, వికారం, తలనొప్పి తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. ఊబకాయం రాదు. ఎనీమియా బారి నుంచి బయటపడొచ్చు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లు స్ట్రెస్‌ హార్మోనుల విడుదలను కొంతవరకూ అరికడతాయి కనుక ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడొచ్చు. అనేక క్యాన్సర్లను నిరోధిస్తాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. మధుమేహంతో బాధపడేవారు కూడా కమలాలు తినొచ్చు. కొందరు కమలా జ్యూస్‌ తాగడానికి ఇష్టపడతారు. కానీ అందులో పీచు అంతా వడకట్టేస్తాం, పంచదార జతచేస్తాం. అంతకంటే కమలాతొనలు అలాగే తినడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని