ఆహా అనిపించే కివానో

కివానో గురించి ఎప్పుడైనా విన్నారా! దక్షిణాఫ్రికాకి చెందిన ఈ పండ్లను నమీబియా, బోత్స్‌వానా, జాంబియా, జింబాబ్వే, మోజాంబిక్‌, అంగోలా దేశాల్లోనూ పండిస్తున్నారు. ఇది దోస, కర్బూజా, పుచ్చ జాతులకు చెందినది.

Published : 25 Feb 2024 00:12 IST

అరుదైన పండు

కివానో గురించి ఎప్పుడైనా విన్నారా! దక్షిణాఫ్రికాకి చెందిన ఈ పండ్లను నమీబియా, బోత్స్‌వానా, జాంబియా, జింబాబ్వే, మోజాంబిక్‌, అంగోలా దేశాల్లోనూ పండిస్తున్నారు. ఇది దోస, కర్బూజా, పుచ్చ జాతులకు చెందినది. ముళ్లు ఉంటాయి కనుక ‘హార్న్‌డ్‌ మెలన్‌’, ‘ఆఫ్రికన్‌ హార్న్‌డ్‌ కుకుంబర్‌’ లాంటి పేర్లతోనూ పిలుస్తారు. నారింజ రంగులో ఉండే కివానో లోపల పసుపు ఆకుపచ్చల కలయికలా కనిపిస్తుంది. విత్తనాలు అచ్చం దోస గింజల్లానే ఉంటాయి. ఈ పండును అలాగే తినొచ్చు లేదంటే సలాడ్‌ చేసుకోవచ్చు. కొందరు వీటిని అలంకరణల్లోనూ వాడతారు. విటమిన్లు, ఫొలేట్‌, కాల్షియం, కాపర్‌, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, భాస్వరం, జింక్‌లతో- కివానో మంచి పోషకాహారం. ఇక రుచి గురించి చెప్పాలంటే అరటి, దోస, నిమ్మ, ప్యాషన్‌ ఫ్రూట్‌లను కలగలిపి తయారుచేశారా అన్నట్టుండి, ఆహా అనిపిస్తుంది. దీని తొక్క కొంచెం పెళుసుగా ఉన్నప్పటికీ.. అందులో సి-విటమిన్‌ మెండుగా ఉంటుందని దాన్ని కూడా తింటారు కొందరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని