ప్రొటీన్లు అందించే మిల్క్‌ మసాలా పొడి ఇంట్లోనే..

పిల్లలకు క్యాల్షియం అందాలి కనుక.. పాలు తప్పకుండా తాగాలి. అవి నోటికి హితవుగా ఉండి, బలాన్నివ్వాలని మార్కెట్లో దొరికే ప్రొటీన్‌ పౌడర్లు తెస్తుంటాం. అలాంటి మిల్క్‌ మసాలా పౌడర్‌ ఇంట్లోనే చేసుకోవచ్చు.

Published : 05 May 2024 00:25 IST

పిల్లలకు క్యాల్షియం అందాలి కనుక.. పాలు తప్పకుండా తాగాలి. అవి నోటికి హితవుగా ఉండి, బలాన్నివ్వాలని మార్కెట్లో దొరికే ప్రొటీన్‌ పౌడర్లు తెస్తుంటాం. అలాంటి మిల్క్‌ మసాలా పౌడర్‌ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది కొన్న దాని కంటే రుచి, శక్తి కూడా. పైగా ఎలాంటి ప్రిజర్వేటివ్‌లూ ఉండవు. ఈ పౌడర్‌ చేసేందుకు.. పిస్తా, బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులు అర కప్పు చొప్పున, పంచదార 20 చెంచాలు, గులాబీరేకలు 2 చెంచాలు, సోంపు చెంచా, మిరియాలు అర చెంచా, డ్రైజింజర్‌ పొడి, జాజికాయ పొడి, పసుపు పావు చెంచా చొప్పున, యాలకులు 15, కుంకుమ పువ్వు కొద్దిగా సిద్ధం చేసుకోవాలి.

ఎలా చేయాలంటే..

పిస్తా, బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులను సన్న సెగ మీద నాలుగు నిమిషాలు వేయిస్తే మంచి వాసన వస్తుంది.. వాటిని పళ్లెంలోకి తీసి.. సోంపు, మిరియాలు, యాలకులు, గులాబీరేకలు, కుంకుమ పువ్వులను వేయించాలి. ఇవన్నీ చల్లారాక.. జార్‌లోకి తీసి.. పంచదార, డ్రైజింజర్‌ పొడి, జాజికాయ పొడి, పసుపు చేర్చి మెత్తగా పొడి చేయాలి. జార్‌ మరీ చిన్నదైతే రెండు విడతలుగా గ్రైండ్‌ చేసుకోవాలి. అంతే.. ‘మిల్క్‌ మసాలా పౌడర్‌’ తయారైపోతుంది. మామూలుగా గ్లాసుడు పాలకు 2 స్పూన్ల పొడి సరిపోతుంది. పిల్లల అభిరుచిని బట్టి ఇంకాస్త తక్కువ లేదా ఎక్కువ వేయొచ్చు. పంచదార కూడా విడిగా కలపాల్సిన పని లేదంటే ఎంత హాయి కదూ! డ్రైఫ్రూట్స్‌ మాత్రం తాజావి తీసుకోండి. చాన్నాళ్లు నిలవుండాలి కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు