దాహం తీర్చే గులాబి జామకాయలు

మండు వేసవిలో... దాహార్తిని తీర్చి పోషకాలు అందించే పళ్లలో రోజ్‌ యాపిల్‌ కూడా ఒకటి. వీటినే గులాబ్‌ జామూన్లు, గులాబీ జామకాయలు అని కూడా అంటూ ఉంటారు. వీటితో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..

Published : 23 Apr 2023 00:28 IST

మండు వేసవిలో... దాహార్తిని తీర్చి పోషకాలు అందించే పళ్లలో రోజ్‌ యాపిల్‌ కూడా ఒకటి. వీటినే గులాబ్‌ జామూన్లు, గులాబీ జామకాయలు అని కూడా అంటూ ఉంటారు. వీటితో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి..

* పచ్చిగా ఉన్న కాయలు వగరుగా ఉంటాయి. వీటిని పచ్చళ్లు, కూరల తయారీలో ఉపయోగిస్తారు. పండినవైతే రుచిలో తీయగా, కరకరలాడుతూ అద్భుతంగా ఉంటాయి. వీటితో జ్యూసులు, స్మూతీలు తయారుచేసుకోవచ్చు. కెలొరీలు తక్కువగా ఉండి, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్‌ ఎ, బి, సిలు పుష్కలంగా లభిస్తాయి. గుండె పనితీరు మెరుగు పడుతుంది.

* ఈ పండ్లలోని ఫ్లెవనాయిడ్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. సి విటమిన్‌ తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. చిన్న చిన్న ఆనారోగ్యాలు, జలుబు, జ్వరాల వంటివి ఎదుర్కొనే శక్తిని అందిస్తాయీ గులాబి జామకాయలు. దీంట్లో ఉండే నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఈ పండ్లలో ఐరన్‌ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భిణులకు ఇవి చాలా మేలు చేస్తాయి. వికారం నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారూ ఈ పండు తీసుకోవచ్చు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి.

జామ్‌..

పండ్లని శుభ్రంగా కడిగి వాటిలోని గింజల్ని తీసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని కడాయిలో వేసుకొని దాంట్లో ఒక కప్పు ఆపిల్‌ గుజ్జుకు అరకప్పు చక్కర వేసుకొని దగ్గర పడనివ్వాలి. అప్పుడే ఓ పావు చెక్క నిమ్మరసం పిండితే రుచిని ఇంకా పెంచుతుంది. గుజ్జు దగ్గర పడగానే స్టౌ ఆపేసుకోవటమే. రుచికరమైన జామ్‌ రెడీ.. పిల్లలకు బ్రెడ్‌తోపాటు ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని