బలాన్నిచ్చే సూప్
సిక్కింల వంటల్లో ‘శిష్ణు సూప్’ ఒకటి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో దీన్ని తయారుచేస్తారు. అడవి రకాల ఆకుల్లో రేగుట ఒకటి. వీటినే నెట్టెల్ ఆకులు అంటారు.
సిక్కింల వంటల్లో ‘శిష్ణు సూప్’ ఒకటి. సాధారణంగా కొండ ప్రాంతాల్లో దీన్ని తయారుచేస్తారు. అడవి రకాల ఆకుల్లో రేగుట ఒకటి. వీటినే నెట్టెల్ ఆకులు అంటారు. ఇదెలా చేస్తారంటే.. ముందుగా నీళ్లు మరిగించి మొక్కజొన్న పిండి వేసి కలియతిప్పాలి. అందులో బెండకాయ ముక్కలు, రేగుట ఆకులు వేయాలి. కాస్త దగ్గరపడ్డాక- మిరియాల పొడి, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి దించేయాలి. వెల్లుల్లి రెబ్బలను నూనె లేదా నేతిలో వేయించి.. ఆకు మిశ్రమంలో కలిపితే సరి.. వేడి వేడి శిష్ణు సూప్ సిద్ధం. ఎక్కువమంది దీన్ని కొంచెం పల్చగా తాగడానికి అనుకూలంగా చేస్తారు. చెంచాతో తినేలా ఉండాలనుకుంటే.. తక్కువ నీళ్లతో చిక్కగా చేసుకుంటారు. ఎలా అయినా బాగుంటుంది. వెంటనే బలం చేకూరడమే కాకుండా.. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల వాపు, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొందరు మొక్కజొన్న పిండికి బదులు బియ్యప్పిండి ఉపయోగిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Lokesh: వైకాపా అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అక్రమ కేసులు: నారా లోకేశ్
-
Janasena: తెలంగాణలో 32 చోట్ల జనసేన పోటీ.. జాబితా ఇదే
-
Chromebook: భారత్‌లో క్రోమ్‌బుక్‌ల తయారీ ప్రారంభం.. రూ.15,990కే కొత్త క్రోమ్‌బుక్!
-
Hyderabad: హోమ్‌వర్క్ చేయలేదని పలకతో కొట్టిన టీచర్.. బాలుడి మృతి
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ruturaj Gaikwad: ధోనీ నుంచి నేర్చుకున్నా.. కెప్టెన్సీలో నా స్టైల్ నాదే: రుతురాజ్ గైక్వాడ్