ఉల్లి పొడి..ఇలా చేయండి!

కూరలు, స్నాక్స్‌.. ఏవైనా సరే రొటీన్‌గా ఉంటే మనకు నచ్చవు. వాటినే ఎప్పటికప్పుడు కొత్తగా, మరింత టేస్టీగా చేసుకునేందుకు రకరకాల పొడులు మార్కెట్లో దొరుకుతున్నాయి.

Updated : 11 Feb 2024 03:49 IST

కూరలు, స్నాక్స్‌.. ఏవైనా సరే రొటీన్‌గా ఉంటే మనకు నచ్చవు. వాటినే ఎప్పటికప్పుడు కొత్తగా, మరింత టేస్టీగా చేసుకునేందుకు రకరకాల పొడులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో ఒకటి ఆనియన్‌ పౌడర్‌. కొన్ని వంటకాల్లో ఉల్లి తరుగు వాడటం కంటే ఈ పొడి అదనపు రుచిని ఇస్తుంది. ఎక్కువ ఖరీదు చెల్లించి రసాయనాలు కలిపిన పౌడర్‌ కొనితెచ్చుకోవడం కంటే ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.

ముందుగా కిలో ఉల్లిపాయల పొట్టు తీసి, కడిగి, సన్నగా తరగాలి. లేదంటే వెజిటబుల్‌ స్లైసర్‌తో స్లైసెస్‌ చేయొచ్చు. వాటిని నాలుగు రోజులు ఎండబెట్టాలి. చల్లటి ప్రదేశంలో ఉండేవాళ్లు అవెన్‌లో 60-70 డిగ్రీల సెల్సియస్‌ వద్ద వేడి చేయొచ్చు. ఎండిన ఉల్లిపాయ ముక్కలను గ్రైండ్‌ చేసి మెత్తటి పొడి చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్‌ పౌడర్‌ను తడిలేని సీసాలో భద్రపరచుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని