ఇవి సైనస్‌ను తగ్గిస్తాయి..

సైనస్‌ మహా ఇబ్బందికరమైంది. తరచూ జలుబు, తలనొప్పితో అవస్థపెడుతుంది. చల్లదనం సోకినా, సరిపడని పదార్థాలు తిన్నా క్షణాల్లో శ్వాస ఇబ్బంది, ముక్కుదిబ్బళ్లు వచ్చేస్తాయి. ఈ చలికాలం దాన్నుంచి బయటపడాలంటే ఇలా చేసి చూడండి..

Published : 11 Feb 2024 01:15 IST

సైనస్‌ మహా ఇబ్బందికరమైంది. తరచూ జలుబు, తలనొప్పితో అవస్థపెడుతుంది. చల్లదనం సోకినా, సరిపడని పదార్థాలు తిన్నా క్షణాల్లో శ్వాస ఇబ్బంది, ముక్కుదిబ్బళ్లు వచ్చేస్తాయి. ఈ చలికాలం దాన్నుంచి బయటపడాలంటే ఇలా చేసి చూడండి..

 వేడివేడిగా.. సైనస్‌తో బాధపడే వారు ఫ్రిజ్‌లోవి తినొద్దు, తాగొద్దు. అన్నం, ఫలహారాలూ ఏవైనా వేడిగా తీసుకోవాలి. సూప్‌, పాలు, టీ.. ఇలా ఏదైనా వెచ్చగా తాగుతుంటే.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలుగుతుంది. శొంఠి, ధనియాలతో కషాయం చేసి తాగితే ఇంకా మంచిది.


 సిట్రస్‌ ఫ్రూట్స్‌
ఆయా కాలాల్లో దొరికే పండ్లు తింటుండాలి. ముఖ్యంగా విటమిన్‌ సి ఎక్కువగా ఉన్న నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి లాంటివి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఈ ఆమ్లఫలాల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నందున జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తేనె రోజూ ఉదయాన్నే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చెంచా తేనె, పావు చెంచా నిమ్మరసం వేసుకుని తాగుతుంటే సైనస్‌ బాధ నుంచి బయటపడొచ్చు.  నీళ్లు ఎంత ఎక్కువ నీళ్లు తాగితే శరీరంలో ఉన్న కల్మషాలు అంత తగ్గిపోతాయి. రోజుకు 2 లీటర్ల చొప్పున నీళ్లు తాగుతుంటే.. సైనస్‌ తగ్గే అవకాశం ఉంది.


అల్లం, వెల్లుల్లి
వీటిలోని యాంటీ ఫంగల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు నొప్పి, వాపు, అలర్జీలను తగ్గిస్తాయి. కనుక అల్లం, వెల్లుల్లి ఏదో రూపంలో తింటుంటే సైనస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు