భలేగుంది... బాంబూ లస్సీ!

బొంగులో చికెన్‌ గురించి వినే ఉంటారు...కానీ ఈ బాంబూ లస్సీ ఏంటనే కదా మీ సందేహం. ఇది కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం స్పెషల్‌.

Published : 02 Jul 2023 00:23 IST

బొంగులో చికెన్‌ గురించి వినే ఉంటారు...కానీ ఈ బాంబూ లస్సీ ఏంటనే కదా మీ సందేహం. ఇది కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం స్పెషల్‌. ప్లాస్టిక్‌ వాడటం ఇష్టంలేని వీరవల్లి దుర్గాప్రసాద్‌ అద్భుత సృష్టి. మీగడ పాలని ఈ వెదురు బొంగులో తోడుపెట్టి... పంచదార, హార్లిక్స్‌, జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులను చేర్చి దీన్ని తయారు చేస్తారు. ఈ లస్సీ రుచిలోనూ మేటి అనే పేరు తెచ్చుకోవడంతో... ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి క్యూ కట్టేస్తున్నారు... జిహ్వ రుచిని పెంచి, ఆరోగ్యానికీ మేలు చేసేది కావడంతో అంతా ఆస్వాదిస్తున్నారు.

ఎస్‌ కనికిరెడ్డి, రావులపాలెం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని