బిర్యానీ తాగి చూడండి!

మనలో 90 శాతం చాయ్‌ ప్రియులమే. మామూలు టీ సంగతలా ఉంచితే.. లెమన్‌ గ్రాస్‌, రోజ్‌, ఇలాచీ అంటూ చాయ్‌లో వందల రకాలున్నాయి. ఇప్పుడు కొత్తగా బిర్యానీ చాయ్‌ కూడా వచ్చేసింది.

Published : 14 Jan 2024 00:36 IST

మనలో 90 శాతం చాయ్‌ ప్రియులమే. మామూలు టీ సంగతలా ఉంచితే.. లెమన్‌ గ్రాస్‌, రోజ్‌, ఇలాచీ అంటూ చాయ్‌లో వందల రకాలున్నాయి. ఇప్పుడు కొత్తగా బిర్యానీ చాయ్‌ కూడా వచ్చేసింది. వివరాల్లోకి వెళ్తే .. నేహా దీపక్‌ షా అనే చెఫ్‌ తన ఇన్‌స్టాలో ఈ ప్రత్యేకమైన బిర్యానీ చాయ్‌ రెసిపీ పోస్ట్‌ చేసింది. దీన్నెలా చేయాలంటే.. అర లీటరు నీళ్లలో ఏడెనిమిది మిరియాలు, మూడు నాలుగు యాలకులు, రెండంగుళాల దాల్చినచెక్క, ఒక స్టార్‌ మొగ్గ (స్టార్‌ ఎనైస్‌), అర చెంచా సోంపు, ఇంకో అర చెంచా టీపొడి వేసి మరిగించాలి. మంచి పరిమళం వస్తుండగా సెగ తగ్గించాలి. ఈలోగా.. అల్లం ముక్కను కచ్చాపచ్చా దంచి కప్పు లేదా గ్లాసులో వేయాలి. అందులో కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం, కొన్ని తాజా పుదీనా ఆకులు వేసి.. మరిగించిన బిర్యానీ కషాయం జతచేయాలి. ఇక చెప్పేదేముంది.. అద్భుతమైన బిర్యానీ చాయ్‌ రెడీ. వీడియో పక్కన డిస్క్రిప్షన్‌ కూడా ఉండటంతో జనాలకు తెగ నచ్చేసింది. ఈ వీడియో పోస్టయిన రెండు రోజులకే 92,108 లైక్స్‌తో.. సూపర్‌, అదుర్స్‌ వంటి కామెంట్లతో దూసుకుపోతోంది. నచ్చితే మీరూ బిర్యానీ చాయ్‌ ప్రయత్నించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని