వయసును పెరగనివ్వదు

మాంగోస్టీన్‌ పండు గురించి ఎప్పుడైనా విన్నారా?! ఇది ఊదారంగులో చూడముచ్చటగా ఉంటుంది. దీన్ని తెలుగులో ‘వంగ మామిడి’, ఇంగ్లిష్‌లో ‘పర్పుల్‌ మాంగోస్టీన్‌’ అంటారు.

Published : 14 Jan 2024 00:37 IST

మాంగోస్టీన్‌ పండు గురించి ఎప్పుడైనా విన్నారా?! ఇది ఊదారంగులో చూడముచ్చటగా ఉంటుంది. దీన్ని తెలుగులో ‘వంగ మామిడి’, ఇంగ్లిష్‌లో ‘పర్పుల్‌ మాంగోస్టీన్‌’ అంటారు. మనకు అంతగా పరిచయం లేని ఈ పండు ఇండోనేషియా, కొలంబియా, వెస్టిండీస్‌, జమైకా, అమెరికా దేశాల్లో పెరుగుతుంది. ఈ చెట్లు 6 నుంచి 25 మీటర్ల పొడవు వరకూ ఉంటాయి. ఈ పండులో పీచు ఎక్కువే. విత్తనాలు ఆకారం, పరిణామాల్లో బాదంపప్పుల్ని పోలి ఉంటాయి. తొక్క మందంగా.. పెంకు కట్టినట్టు ఉంటుంది. మాగిన పండ్లలో తెల్లటి గుజ్జు.. మంచి సువాసన వెదజల్లుతూ ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలా ఉంటుంది. రుచి గురించి చెప్పాలంటే.. కొంచెం తియ్యగా, కొంచెం పుల్లగా ఉంటుంది. విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫొలేట్‌, ఫైబర్‌ విస్తారంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. డయాబెటిస్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అన్నిటినీ మించి మాంగోస్టీన్‌లో యాంటీ ఏజింగ్‌ గుణాలు ఉన్నందున వయసు మీదపడనివ్వదు. బాగుంది కదూ.. ఓ మొక్కని తెచ్చేసి మనమూ పెంచుకుందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని