ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా తాలింపు ఘుమఘుమ..

వేసవి వస్తే వడియాలు, ఒరుగులు చేస్తారు కదా! అలానే ఈ తాలింపు వడియాలని కూడా ప్రయత్నించండి. పేరు ఎప్పుడూ విన్నట్టుగా లేదు కదా! ఏడాదిపొడవునా అవసరం అయిన తాలింపుల కోసం చేసే వడియాలివి.

Published : 21 May 2023 00:22 IST

వేసవి వస్తే వడియాలు, ఒరుగులు చేస్తారు కదా! అలానే ఈ తాలింపు వడియాలని కూడా ప్రయత్నించండి. పేరు ఎప్పుడూ విన్నట్టుగా లేదు కదా! ఏడాదిపొడవునా అవసరం అయిన తాలింపుల కోసం చేసే వడియాలివి. ఒక్కసారి ఈ వడియాలు పెట్టుకుంటే ఏడాదంతా హైరానా పడాల్సిన అవసరం లేదు..

రకిలో ఉల్లిపాయముక్కలకి.. మూడు చెంచాల చొప్పున ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. మినపప్పు ఐదుచెంచాల వరకూ వేసుకోవచ్చు. తగినంత పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లో ఒక కప్పు వెల్లుల్లిరెబ్బలు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయముక్కల్లో వేసి కలిపి రాత్రంతా పక్కన పెట్టేయాలి. మరుసటి రోజు ఎండలో పెట్టి రోజంతా వదిలేయాలి. కాస్త తడి పొడిగా ఉన్నప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకుని మంచి ఎండలో వారం పదిరోజులు ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత తీసి డబ్బాలో దాచుకుంటే ఏడాదిపొడవునా తాలింపులకోసం వీటిని వాడుకోవడమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని