Jowar Roti Benefits: బరువు తగ్గాలంటే జొన్నరొట్టెలు!

ఇప్పుడు కొంతమంది జొన్నరొట్టెలకే మా ఓటు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఊబకాయం రాకూడదన్నా అవే బెస్ట్‌ అంటున్నారు. ఇంతకూ జొన్నల్లో ఉన్న సుగుణాలేంటో చూద్దాం..

Published : 25 Feb 2024 14:39 IST

పోషకాలమ్‌

ప్పుడు కొంతమంది జొన్నరొట్టెలకే మా ఓటు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలన్నా, ఊబకాయం రాకూడదన్నా అవే బెస్ట్‌ అంటున్నారు. ఇంతకూ జొన్నల్లో ఉన్న సుగుణాలేంటో (Jowar Roti Benefits) చూద్దాం.. ప్రొటీన్లు, కెలొరీలు, పీచు, పిండిపదార్థాలు, విటమిన్లు, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, భాస్వరం, జింక్‌, మాంగనీస్‌, సెలేనియంలతో ఇవి మంచి పోషకాహారం.

జొన్నల్లోని విటమిన్‌ బి, బి3లు బలాన్నిస్తాయి. ఎనీమియాతో బాధపడేవారు జొన్న ఆహారం తీసుకోవడం వల్ల తక్షణ ప్రయోజనం ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు కూడా జొన్నలు తినొచ్చు. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెరగనివ్వవు. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. ఇవి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి.

ట్యూమర్లను పెరగనివ్వవు. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వెన్నుకు పటుత్వం వస్తుంది. నడుం నొప్పి రాదు. వీటిలో ఉన్న బి6 విటమిన్‌ నరాల వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఉద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బాగుంటుంది. మలబద్ధక సమస్య తలెత్తదు.

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి జొన్నలతో చేసిన ఆహారం చాలా మంచిది. జొన్నలతో మనం తరచూ తినే రొట్టెలే కాకుండా ఉప్మా, పొంగల్‌, పూరీ, ఊతప్పమ్‌, ముథియాస్‌, షీరా, తాలీపీఠ్‌, గోల్‌పాప్టీ, ప్యాన్‌కేక్‌, ప్యాజ్‌ కీ రోటీ, బ్రెడ్‌ స్టిక్స్‌.. ఇలా వందకు పైగా రకాలు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యం, రుచీ కూడా. తినగలిగితే జొన్నఅన్నం వరి కంటే చాలా మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు