Viral video: లెఫ్ట్‌ రైట్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌..

ఇంతకుముందు పెళ్లి ఊరేగింపంటే నిదానంగా కారులో మండపానికి చేరుకోవడం, ఇరవైల్లో ఈ ట్రెండ్‌ మారింది. పాటలు, పటాస్‌లు, వదువువరుల కుటుంబాల నృత్యాలు, ఇప్పుడు పెళ్లంటే నాగిన్‌ డాన్స్‌ లేనిదే కారు కదలడానికి వీలు లేదు. ఇదేంటి అనుకోకండి మన వాళ్లు ట్రెండ్‌ సెట్‌ చేయడంలో దర్శకుడు రాజమౌళిని మించిపోయారు

Updated : 21 Apr 2022 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంతకుముందు పెళ్లి బరాత్‌ అంటే నిదానంగా కారులో మండపానికి చేరుకోవడం, ఇటీవల ఈ ట్రెండ్‌ మారింది. పాటలు, పటాస్‌లు, వధూవరుల కుటుంబాల నృత్యాలు, ఇప్పుడు పెళ్లంటే నాగిన్‌ డాన్స్‌ లేనిదే కారు కదలడానికి వీలు లేదు. ఇదేంటి అనుకోకండి మన వాళ్లు రోజుకో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు  . ఆ ట్రెండింగ్‌ పెళ్లి వేడుకలకు సంబంధించిన నృత్యమే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది.

దాని విశేషమేంటో తెలుసుకుందాం పదండి..పెళ్లి వేడుకల్లో ఒక వ్యక్తి చేసిన వైవిధ్యమైన నృత్యాన్ని ఐపీఎస్‌ దీపాంశు కబ్రా ట్విటర్‌ వేదికగా  పోస్ట్‌ చేశారు. దీనికి ట్రైనింగ్‌ పూర్తయిన వెంటనే పెళ్లి వేడుకలకు హజరైన జవాన్‌ అంటూ ట్యాగ్‌ కూడా జోడించారు. ప్రస్తుత్తం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వుల పువ్వులు పూయిస్తోంది. దీంతో ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే 1.20 లక్షల వ్యూస్‌ వచ్చాయి. 29 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో అంత ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి పెళ్లి వేడుకల్లో నృత్యానికి బదులు మిలటరీ మార్చ్‌ చేసి ఆనందాశ్చర్యాలకు గురిచేశాడు. నెటిజన్లను ఆకట్టుకున్నాడు. నృత్యం మొదటిలో సెల్యూట్‌ చేస్తూ వచ్చి డ్రమ్మర్ల చుట్టు ఒక రౌండ్‌ కొట్టి లెఫ్ట్‌, రైట్‌ అంటూ మార్చ్‌ చేసి, క్రికెట్‌ బంతిని విసిరేటప్పుడు చేసే విన్యాసాలన్నీ చేశాడు. చూపరులను ఆకర్షించిన వీడియో ఏ ప్రాంతానికి సంబంధించినది అన్నది తెలియరాలేదు. ఏమైతేనేం గజిబిజి జీవితాల్లో కొంత వినోదాన్ని కలిగిస్తుంది. దీనికి కొందరు నెటిజన్లు ఇవన్ని ట్రైనింగ్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌ అని, ఇంకొందరు డాన్స్‌ రాని వాళ్లని చేయమంటే ఇలానే ఉంటుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని