మోనోక్రోమ్‌.. మరింత ముస్తాబై

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. ఈ సూత్రం ఫ్యాషన్‌కి బాగా వర్తిస్తుంది. పాత స్టైలే కొద్దిపాటి మార్పులతో కొత్తగా మళ్లీ మళ్లీ రావడం సొగసుల రంగంలో ఎక్కువే. అదే ఊపులో ఇప్పుడు మోనోక్రోమ్‌ ఔట్ఫిట్‌ల వంతు వచ్చింది. ఫ్యాబ్రిక్‌, ప్యాటర్న్‌లలో చిన్నపాటి మార్పులతో మోనోక్రోమ్‌ల....

Updated : 29 Feb 2024 14:17 IST

ల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. ఈ సూత్రం ఫ్యాషన్‌కి బాగా వర్తిస్తుంది. పాత స్టైలే కొద్దిపాటి మార్పులతో కొత్తగా మళ్లీ మళ్లీ రావడం సొగసుల రంగంలో ఎక్కువే. అదే ఊపులో ఇప్పుడు మోనోక్రోమ్‌ ఔట్ఫిట్‌ల వంతు వచ్చింది. ఫ్యాబ్రిక్‌, ప్యాటర్న్‌లలో చిన్నపాటి మార్పులతో మోనోక్రోమ్‌ల స్టైల్‌ ఊపందుకుంటోంది. సెలెబ్రెటీల నుంచి గల్లీ కుర్రకారు దాకా ఈ వేసవిలో అంతా దీనివెంటే పడుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడాలేం లేకుండా తారలంతా ఈ స్టైల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారిపోయారు. ఇందులోనూ గ్రాఫిక్‌ నలుపు, తెలుపు, పోల్కా చుక్కల డిజైన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. జతగా షార్ట్‌ జాకెట్‌లు, రఫుల్డ్‌ క్రాప్‌లు, రిప్డ్‌ జీన్స్‌లతో అదరగొడుతున్నారు. వేసవి తాపం నుంచి రక్షణ కూడా కావాలనుకునేవారు తెలుపు రంగు మోనోక్రోమ్స్‌కి ఓటేస్తున్నారు. మన తెలుగు స్టార్‌ అక్కినేని సమంత నుంచి బాలీవుడ్‌ వైపు చూస్తే దీపికా పదుకొనె, అనన్యా పాండే, సోనాక్షి సిన్హా, ప్రియాంకా చోప్రా, దిశా పటానీ.. వీళ్లంతా పార్టీలు, క్యాజువల్‌ వేర్‌లో ఇదే డిజైన్‌తో అదరగొడుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని