వయసు మళ్లినా.. వండర్‌ఫుల్‌

ఉదయాన్నే లేచి నాలుగు అడుగులు వేయాలంటే బద్ధకం. కసరత్తులు చేసి నాలుగు కేజీలు కరిగించాలంటే మనవల్ల కాదు. చాలామంది యువత తీరింతే. కానీ యాభై, అరవైల్లోనూ ఆరు పలకల దేహంతో.. అందమైన రూపంతో ఆకట్టుకుంటున్నారు కొందరు సినీ తారలు.

Published : 05 Nov 2022 01:09 IST

దయాన్నే లేచి నాలుగు అడుగులు వేయాలంటే బద్ధకం. కసరత్తులు చేసి నాలుగు కేజీలు కరిగించాలంటే మనవల్ల కాదు. చాలామంది యువత తీరింతే. కానీ యాభై, అరవైల్లోనూ ఆరు పలకల దేహంతో.. అందమైన రూపంతో ఆకట్టుకుంటున్నారు కొందరు సినీ తారలు. సీనియర్‌ సిటిజన్‌గా మారడానికి సిద్ధంగా ఉన్న షారూక్‌ ఖాన్‌ రాబోయే ‘పఠాన్‌’ సినిమాలో రిప్డ్‌ బాడీతో అదరగొడుతున్నాడు. మలైకా అరోరా ఐదు పదులకి ఒక్క ఏడాదే తక్కువైనా.. అందంలో పడుచు అమ్మాయిలకు పోటీ ఇస్తోంది. శిల్పాశెట్టి తెరపై కవ్వించడం మొదలు పెట్టి దాదాపు ముప్ఫై ఏళ్లైనా ఇప్పటికీ అదే అందం మెయింటెయిన్‌ చేస్తోంది. కండల వీరుడు అనే ట్యాగ్‌లైన్‌ని జాన్‌ అబ్రహం ఇరవై ఐదేళ్లుగా కాపాడుకుంటున్నాడు. చొక్కా విప్పితే ఉబికి వచ్చే కండలతో హృతిక్‌ రోషన్‌ ఇప్పటికీ అమ్మాయిల హృదయాల్లో కలవరం రేపుతూనే ఉన్నాడు. ఐశ్వర్యరాయ్‌ గురించి చెప్పేదేముంది? ప్రపంచ సుందరి అయినప్పటి నుంచి తన సొగసు ఇసుమంతైనా తగ్గలేదు. యాభై ఆరేళ్ల మిస్టర్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌ ఇప్పటికీ టేనేజీ కుర్రాళ్లతో పోటీ పడుతూ ఫిట్‌గా ఉన్నాడు. అమీర్‌ఖాన్‌ కండరగండడే. వీళ్లంతా ఎంతో కష్టపడితేగానీ.. క్రమం తప్పకుండా సాధన చేస్తేగానీ ఆ రూపం కాపాడుకోవడం సాధ్యం కాదన్నది ఫిట్‌నెస్‌ నిపుణుల మాట. ఇంతకీ ఈ ముదురు తారల అందం, ఫిట్‌నెస్‌ రహస్యం ఏంటి?


నటి: ఐశ్యర్యా రాయ్‌, వయసు: 49
రహస్యం: రోజుకి 45నిమిషాల పవర్‌ యోగా. ముఖానికి క్రమంతప్పకుండా పెరుగుని పట్టిస్తుంది. అరోమా థెరపీ తప్పనిసరి.
నటి: మలైకా అరోరా
వయసు: 49
సౌందర్య రహస్యం: ఇరవై ఆరేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తోంది. అరగంట యోగా, ధ్యానం తప్పనిసరి. రెండుమూడేళ్ల నుంచి శ్వాస వ్యాయామాలు.


నటి: మలైకా అరోరా
వయసు: 49
సౌందర్య రహస్యం: ఇరవై ఆరేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తోంది. అరగంట యోగా, ధ్యానం తప్పనిసరి. రెండుమూడేళ్ల నుంచి శ్వాస వ్యాయామాలు.


హీరో: హృతిక్‌ రోషన్‌,
వయసు: 48
ఫిట్‌నెస్‌ రహస్యం: రోజూ వెయిట్‌ వర్కవుట్లు, కార్డియో వ్యాయామాలు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటాడు.


హీరో: షారూక్‌ ఖాన్‌
వయసు: 58
ఫిట్‌నెస్‌: రోజుకి 45 నిమిషాలు కఠిన కసరత్తులు. కొవ్వులేని  ఆహారం.


హీరో: అక్షయ్‌కుమార్‌
వయసు: 55
ఫిట్‌నెస్‌: రోజూ కిక్‌ బాక్సింగ్‌, ఈత. వారంలో నాలుగురోజులు యోగా, అప్పుడప్పుడు బాస్కెట్‌ బాల్‌.


నటి: శిల్పాశెట్టి, వయసు: 47
సౌందర్య రహస్యం: 2003లో సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ సమస్య తగ్గించుకోవడానికి యోగా మొదలుపెట్టింది. అప్పట్నుంచి కొనసాగిస్తోంది. క్రమంతప్పని కార్డియోవాస్క్యులర్‌ వ్యాయామాలు. చక్కెరలు లేని మితాహారం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని