సర్వదర్శన టోకెన్‌ కేంద్రాలను పెంచిన తితిదే

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు తితిదే చర్యలు చేపట్టింది.

Published : 07 Nov 2020 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు తితిదే చర్యలు చేపట్టింది. గతంలో భూదేవీ కాంప్లెక్స్‌లో మాత్రమే ఈ దర్శనానికి సంబంధించిన టోకెన్లు జారీ చేసేవారు. తాజాగా విష్ణు నివాసం వసతి గృహంలో కూడా ఈ టికెట్ల జారీ సేవలను ప్రారంభించింది. రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌కు వచ్చే యాత్రికుల కోసం విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తున్నారు. స్వామి వారి భక్తుల రద్దీ పెరుగుతుండటంతో, కరోనా దృష్ట్యా సర్వదర్శనం టైం స్లాట్‌ టోకెన్ల సెంటర్లను పెంచినట్లు తితిదే వెల్లడించింది. కొవిడ్‌ నేపథ్యంలో మూడు నుంచి పది వేల మంది వరకు సర్వదర్శనం టోకెన్లు చేస్తున్నట్లు తితిదే తెలిపింది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని