logo

ఒక్క పథకమైనా నడిచిందా?

తమిళనాడులో ప్రభుత్వం మారినా అమ్మా క్యాంటీన్లు కొనసాగాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు తెలిపారు.

Updated : 24 Jun 2022 06:25 IST

రూ.8 లక్షల కోట్ల అప్పుతో

అన్న క్యాంటీన్‌ వాహనాన్ని ప్రారంభిస్తున్న అశోక్‌గజపతిరాజు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తమిళనాడులో ప్రభుత్వం మారినా అమ్మా క్యాంటీన్లు కొనసాగాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు తెలిపారు. రాష్ట్రంలో పేదల పథకాలు ఒక్కొక్కటిగా ఆపేస్తున్నారని, అందులో శ్రమజీవులకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు ఒక్కటన్నారు. గురువారం బంగ్లాలో పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన చేపట్టనున్న ఉచిత అన్న క్యాంటీన్‌ సంచార వాహనాన్ని ఆయన ప్రారంభించారు.  రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుతో ఒక్క పథకమైనా నడిచిందా? అని ప్రశ్నించారు. విద్యుత్తు మీటరు మారుతున్నట్లు ప్రతి నిమిషానికి అప్పు పెరుగుతుందని ఎద్దేవా చేశారు. రూ.కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయో దేవుడికే తెలియాలన్నారు. అనంతరం అశోక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పేర్లవారి వీధిలో చెవిటి, మూగ పాఠశాలలో ఏడాది పాటు అయిదుగురు విద్యార్థుల దత్తత నిమిత్తం రూ.30 వేలు, ప్రేమ సమాజానికి రూ.20 వేల చెక్కును బేబినాయన అందజేశారు. కార్యక్రమంలో అదితి గజపతిరాజు, తెంటు లక్ష్మునాయుడు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని