రైతు సంఘాల రుణాలకు నాబార్డు గ్యారంటీ

‘ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు 40పంట ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) మంజూరయ్యాయి. తొలిసారిగా ఈ ఏడాది నుంచి క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ సదుపాయం కల్పిస్తున్నాం. ఎఫ్‌పీఓలు రూ.2 కోట్ల రుణం తీసుకుంటే... అందులో 75 శాతానికి నాబార్డు తరఫున గ్యారంటీ ఇస్తున్నాం..

Updated : 04 Dec 2021 06:40 IST

నాబార్డు ఛైర్మన్‌  చింతల గోవిందరాజులు

విశాఖలో ఆర్గానిక్‌ మేళా ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న నాబార్డ్‌ ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు 40పంట ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) మంజూరయ్యాయి. తొలిసారిగా ఈ ఏడాది నుంచి క్రెడిట్‌ గ్యారంటీ ట్రస్ట్‌ సదుపాయం కల్పిస్తున్నాం. ఎఫ్‌పీఓలు రూ.2 కోట్ల రుణం తీసుకుంటే... అందులో 75 శాతానికి నాబార్డు తరఫున గ్యారంటీ ఇస్తున్నాం...’అని నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు  వెల్లడించారు. గో ఆధారిత పంట ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విశాఖ ఆర్గానిక్‌ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని ఉపయోగించుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. సరైన ప్రణాళికతో సేంద్రియ వ్యవసాయం చేయాలి. రైతుల దగ్గరే శుద్ధి, విలువ జోడింపు వంటి ప్రక్రియ పూర్తయితే మంచి ఆదాయం పొందవచ్చు.  నూనె గింజలు, పప్పుదినుసుల కొరత ఎక్కువగా ఉన్నందున వాటిపై దృష్టి సారించాలి...’ అని పేర్కొన్నారు.  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇటీవల 12 ఎకరాల్లో సేంద్రియ సాగు చేశానని, రైతులు పడే ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడగలిగానన్నారు. భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, రైతు నేస్తం సంపాదకులు పద్మశ్రీ వై.వెంకటేశ్వరావు, భారతీయ కిసాన్‌ సంఘ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని