Andhra News: ‘కోత’ గండం గట్టెక్కింది!: 2018 తర్వాత పెన్షనర్లకు కొత్త పింఛనే

ఆంధ్రప్రదేశ్‌లో 2018 జులై ఒకటి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్‌ మొత్తంలో కోతపడకుండా సర్కారు చర్యలు తీసుకుంది. సీఎఫ్‌ఎంఎస్‌లోనే వారికి కూడా కొత్త మూల పెన్షన్‌ నిర్ధారించి ఆ మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత మొత్తం చెల్లించాల్సిందీ

Updated : 31 Jan 2022 07:32 IST

సీఎఫ్‌ఎంఎస్‌లోనే ఫిక్సేషన్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2018 జులై ఒకటి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్‌ మొత్తంలో కోతపడకుండా సర్కారు చర్యలు తీసుకుంది. సీఎఫ్‌ఎంఎస్‌లోనే వారికి కూడా కొత్త మూల పెన్షన్‌ నిర్ధారించి ఆ మొత్తంపై కొత్త కరవు భత్యం లెక్కించి ఎంత మొత్తం చెల్లించాల్సిందీ ఖరారు చేసింది. ఇందుకు అనుగుణంగా సీఎఫ్‌ఎంఎస్‌లో ప్రోగ్రాం ద్వారా మార్పులు చేసి వారికి కొత్త పెన్షన్‌ బిల్లులు సిద్ధం చేసింది. శనివారంనాటి ఆందోళనకు దీంతో ఉపశమనం కలిగినట్లయింది. కొత్త మూల పెన్షన్‌ నిర్ణయించకుండా, అంతకుముందు నెలలో ఇచ్చిన మధ్యంతర భృతిని కూడా తొలగించి తొలుత పెన్షన్‌ బిల్లులు సిద్ధం చేశారు. శనివారం ఆ స్లిప్పులు చూసి తమకు వచ్చే పెన్షన్‌ మొత్తం కోతపడటంతో అనేక మంది ఆందోళన చెందారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఇతర నాయకులు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నవించారు. సవరణ చేయాలని కోరారు. కొత్త పెన్షన్‌ స్థిరీకరించే వరకు డిసెంబర్‌ నెలలో ఇచ్చినట్లు పెన్షన్‌ ఐఆర్‌తో కలిపి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఏజీ కార్యాలయానికి పంపకుండానే ఈ ప్రక్రియ సీఎఫ్‌ఎంఎస్‌లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కొత్త బిల్లులు సిద్ధమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని