Andhra News: ఆత్మకూరు బరిలో మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు, దివంగత గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పేరును సూచిస్తూ.. మేకపాటి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి

Published : 10 Apr 2022 07:18 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు, దివంగత గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పేరును సూచిస్తూ.. మేకపాటి కుటుంబసభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయానికి తమ అభిప్రాయాన్ని తెలిపారు. తమ నిర్ణయాన్ని ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

విక్రమ్‌రెడ్డి ఊటీలోని గుడ్‌ షెఫర్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఐఐటీ చెన్నైలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అమెరికాలో కన్సస్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో ఎం.ఎస్‌ పూర్తి చేశారు. దివంగత మాజీ మంత్రి గౌతమ్‌రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత.. సొంత సంస్థ కేఎంసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్‌రెడ్డి మరణానంతరం ఆయన సతీమణి శ్రీకీర్తి ఆత్మకూరు నుంచి బరిలో దిగుతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. వాటన్నింటికి మేకపాటి కుటుంబ సభ్యులు ముగింపు పలికారు. దీనిపై ‘ఈనాడు’తో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి స్థానం భర్తీ చేసేందుకు విక్రమ్‌రెడ్డి సరైన ప్రత్యామ్నాయమని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో వైకాపాను బలోపేతం చేయడంతో పాటు.. ప్రజలకు సేవ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని