తమ్మినేని ఇంట వివాహ వేడుక

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వాణిశ్రీల తనయుడు వెంకట చిరంజీవినాగ్‌ వివాహం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో

Published : 07 Aug 2022 03:23 IST

వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, వాణిశ్రీల తనయుడు వెంకట చిరంజీవినాగ్‌ వివాహం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో శనివారం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేడుకకు హాజరై వధూవరులు మాధురి, వెంకట చిరంజీవినాగ్‌లను ఆశీర్వదించారు. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చిన సీఎం జగన్‌ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆమదాలవలసలోని తిమ్మాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వివాహ వేదిక వద్దకు వచ్చారు. కల్యాణ వేదిక వద్ద 20 నిమిషాలు గడిపి, తిరుగు ప్రయాణమయ్యారు. వేడుకకు మంత్రులు బూడి ముత్యాలనాయుడు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, సీదిరి అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పెళ్లి చిత్రీకరించేందుకు విలేకర్ల కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని