సుప్రీంను ఆశ్రయించిన రాజధాని రైతులు

రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున రైతులు సుప్రీం

Updated : 08 Aug 2022 06:51 IST

ఈనాడు, దిల్లీ: రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి తరఫున రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. ప్రజాధనంతో ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఇళ్లు 80% పూర్తయినప్పటికీ అలాగే వదిలేయడం, 70% నిర్మించిన భవనాలను పూర్తి చేయకుండా విస్మరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పు అమలులో జాప్యాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటికే అక్కడి హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని రైతులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని