ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుతో విద్యార్థులకు ఇక్కట్లు

ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వల్ల విద్యార్థులకు ఇక్కట్లు తప్పవని ఆ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అమ్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌

Published : 24 Sep 2022 05:31 IST

ప్రచారానికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి

పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి అమ్మన్న

ఈనాడు, అమరావతి: ఎన్టీఆర్‌ పేరును తొలగించడం వల్ల విద్యార్థులకు ఇక్కట్లు తప్పవని ఆ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అమ్మన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీలు పొందిన విద్యార్థులకు ఉన్నతవిద్య, ఉన్నత ఉద్యోగాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశవిదేశాల్లో ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయమే తెలుసని, ఇప్పుడు కొత్తది వచ్చిందా అన్న భావన వస్తుందని శుక్రవారం వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాల పేర్లు మార్చకూడదన్నారు. ‘పేరు మార్పును విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థులు, విశ్వవిద్యాలయ ఉద్యోగులు, అధికారులు స్వాగతించలేకపోతున్నారు. పేరు మార్పుతో ఉన్నతవిద్య, ఉన్నత ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లినవారికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులకు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరుతో డిగ్రీ పట్టాలు ఇస్తే బాగుంటుంది. లేకుంటే మార్కుల మెమోల పరంగా సమస్యలు వస్తాయి. పేరు మార్పుపై గెజిట్‌ పబ్లికేషన్‌, ఇతర ఆధారాలతో రాష్ట్రప్రభుత్వం జాతీయ వైద్యకమిషన్‌, అన్ని వైద్యమండళ్లు, ఇతర దేశాల్లోని వైద్య విశ్వవిద్యాలయాలకు తెలియజేయాలి. డిగ్రీ పట్టాల్లో పేరు మార్పు గురించిన సమాచారం స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో మార్పులు, చేర్పుల విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని