పెరిగిన అంబేడ్కర్‌ స్మృతి వనం నిర్మాణ వ్యయం

విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ అంచనా వ్యయం రూ.100 కోట్ల నుంచి రూ.265 కోట్లకు పెరిగిందని విగ్రహ

Updated : 28 Sep 2022 04:35 IST

రూ.100 కోట్ల నుంచి రూ.265 కోట్లకు చేరిక: మంత్రి నాగార్జున

సూర్యారావుపేట, న్యూస్‌టుడే: విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణ అంచనా వ్యయం రూ.100 కోట్ల నుంచి రూ.265 కోట్లకు పెరిగిందని విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్‌, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. స్వరాజ్య మైదానంలో జరుగుతున్న విగ్రహ నిర్మాణ పనులను మంగళవారం ఆయన ఏపీ క్రిస్టియన్‌ జేఏసీ ఛైర్మన్‌ డాక్టర్‌ యలమంచిలి ప్రవీణ్‌తో కలిసి పర్యవేక్షించారు. ఎంత ఖర్చయినా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం.. రాబోయే అంబేడ్కర్‌ జయంతి నాటికి విగ్రహావిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. 125 అడుగుల విగ్రహంతో పాటు అంబేడ్కర్‌ జీవిత విశేషాలను తెలిపే ‘అంబేడ్కర్‌ స్మృతి వనం’ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, ఇప్పుడు అది రూ.265 కోట్లకు చేరిందన్నారు. ప్రాజెక్టు చివరి దశకు చేరుకునే సరికి వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని