కక్కలేక.. మింగలేక!

నోటిలో అడ్డంగా ఇరుక్కున్న నత్త పెంకును వదిలించుకోవడానికి ఓ పాము తీవ్ర అవస్థలు పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌ ఎడమ కాలువలో ఓ పాము నత్త పెంకును నోట

Updated : 30 Sep 2022 05:42 IST

నోటిలో అడ్డంగా ఇరుక్కున్న నత్త పెంకును వదిలించుకోవడానికి ఓ పాము తీవ్ర అవస్థలు పడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌ ఎడమ కాలువలో ఓ పాము నత్త పెంకును నోట కరచుకొని అటూ ఇటూ చక్కర్లు కొట్టింది. కొంతసేపటికి ఆ పెంకు నోటికి అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఎంతో హైరానా పడింది. చివరికి జనం అలికిడికి తుర్రుమని తుప్పల్లోకి వెళ్లిపోయింది. ఆ దృశ్యాలను ‘ఈనాడు’ బంధించింది.

-ఈనాడు, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని