కొన్ని వసతిగృహాల్లో నాసిరకంగా ఆహారం

కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఆహారం నాసిరకంగా ఉంటోందని రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి తెలిపారు. నిధులు చాలకపోవడమే దీనికి కారణంగా అధికారులు చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.

Published : 01 Oct 2022 05:55 IST

ప్రభుత్వానికి నివేదిస్తాం

ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ విజయ్‌ ప్రతాప్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఆహారం నాసిరకంగా ఉంటోందని రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి తెలిపారు. నిధులు చాలకపోవడమే దీనికి కారణంగా అధికారులు చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు నమోదులో లోపాలున్నాయని, రేషన్‌ పంపిణీలోనూ కందిపప్పు కొన్ని ప్రాంతాల్లో అందడం లేదన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఆహార కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన పథకాల అమలుకు సంబంధించి ఫిర్యాదు చేయాల్సిన ఫోన్‌ నంబర్లతో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పథకాల అమలులో లోపాలను ఉపేక్షించేది లేదు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నాం. జరిమానాలు విధిస్తున్నాం. రాష్ట్రంలోని 7ఉమ్మడి జిల్లాల్లో కార్డుదారులకు బలవర్థక బియ్యం అందిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నాటికి పంపిణీ చేస్తాం’ అని వివరించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఫిర్యాదులను వాట్సప్‌ ద్వారా 94905 51117, టోల్‌ఫ్రీ 15535 నంబర్లకు పంపాలని ఛైర్మన్‌ సీహెచ్‌ విజయప్రతాప్‌రెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని