విజయవాడలోని తితిదే స్థలంలో కాటేజీలు ఏర్పాటు చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

విజయవాడ కుమ్మరిపాలెం సెంటరులోని రెండు ఎకరాల తితిదే స్థలంలో భక్తుల కోసం కాటేజీలు, కల్యాణ మండపాలు ఏర్పాటు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. దసరా ఉత్సవాల్లో భాగంగా తితిదే తరఫున సారెను ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు మంగళవారం సమర్పించారు.

Published : 05 Oct 2022 03:45 IST

విజయవాడ(ఇంద్రకీలాద్రి), న్యూస్‌టుడే: విజయవాడ కుమ్మరిపాలెం సెంటరులోని రెండు ఎకరాల తితిదే స్థలంలో భక్తుల కోసం కాటేజీలు, కల్యాణ మండపాలు ఏర్పాటు చేస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. దసరా ఉత్సవాల్లో భాగంగా తితిదే తరఫున సారెను ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు మంగళవారం సమర్పించారు. అనంతరం మీడియాతో సుబ్బారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా దుర్గమ్మ కోవెలలో క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆంజనేయ స్వామికి దాతల సహకారంతో బంగారు తొడుగు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సీఎం జగన్‌ పాలనలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో విరాజిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని