Hyderabad: ఐదేళ్లయినా నిండలేదు.. కన్న బిడ్డే.. కన్న తల్లిగా..!

నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంది. మారాం చేసినప్పుడు ఆయన చంకన ఎక్కించుకోగా ఊరంతా కలియతిరిగింది. ఆయన వీపు ఎక్కి ఏనుగు ఆటా ఆడింది. విధి వికటించడంతో ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తండ్రికి అయిదేళ్లయినా నిండని ఆ చిన్నారే ఇప్పుడు అన్నీ తానైంది. 

Updated : 16 Oct 2022 09:16 IST

నాన్న చిటికెన వేలు పట్టుకుని నడక నేర్చుకుంది. మారాం చేసినప్పుడు ఆయన చంకన ఎక్కించుకోగా ఊరంతా కలియతిరిగింది. ఆయన వీపు ఎక్కి ఏనుగు ఆటా ఆడింది. విధి వికటించడంతో ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన తండ్రికి అయిదేళ్లయినా నిండని ఆ చిన్నారే ఇప్పుడు అన్నీ తానైంది.  శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పాట్నూరు సత్యనారాయణ(35) బతుకుదెరువు కోసం 15 ఏళ్ల కిందట హైదరాబాద్‌ వలస వచ్చారు.

గాజులరామారం షాపూర్‌నగర్‌లో నివసిస్తూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ ఏడాది మే నెలలో ఓ దుకాణంపైన బోర్డు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి రెండు చేతులు కాలిపోయాయి. ప్రస్తుతం ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నారు. కుటుంబ పోషణ భారం భార్యపై పడడంతో ఆమె కూలీపనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పగలు తండ్రి పనులన్నీ కుమార్తె చందనప్రియే చూసుకుంటోంది. పని చేయలేని స్థితిలో ఉన్న తనను ప్రభుత్వం ఆదుకోవాలని, దివ్యాంగుల కోటా కింద పింఛను మంజూరు చేయాలని సత్యనారాయణ కోరుతున్నారు. ప్రస్తుతం నివాసముంటున్న ఇంటికి అద్దె కట్టకపోవడంతో యజమాని ఖాళీ చేయమంటున్నారని, ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని