దేదీప్యమానం.. అనంతుని దీపోత్సవం

విశాఖపట్నం జిల్లా పద్మనాభ క్షేత్రంలో శ్రీఅనంత పద్మనాభస్వామి వారి కొండ మెట్ల దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది.

Published : 24 Nov 2022 05:32 IST

పద్మనాభం (విశాఖపట్నం), న్యూస్‌టుడే: విశాఖపట్నం జిల్లా పద్మనాభ క్షేత్రంలో శ్రీఅనంత పద్మనాభస్వామి వారి కొండ మెట్ల దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు అనంతుని గిరిపై కొలువై ఉన్న అనంతపద్మనాభుని, కొండ దిగువున కుంతీమాధవున్ని, నారాయణేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కుంతీమాధవస్వామి ఆలయం నుంచి అనంత పద్మనాభ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తొలి పావంచా వద్దకు తీసుకువచ్చారు. సూర్యాస్తమయం వేళ..కొండపైన అర్చకులు జేగంట మోగించగానే ఉత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు 1285 మెట్లకు ఇరువైపులా తైల దీపాలను వెలిగించారు. సుమారు రెండున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని